న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు గురువారం సోషల్ మీడియా వేదికలను ఆదేశించింది. ఇందుకు మూడు రోజుల గడువు విధించింది. కొన్ని సామాజిక మాధ్యమాలు అనధికారికంగా తన పేరు, ఫోటోలు తన ఇష్టాయిష్టాలు చివరికి తన వ్యక్తిత్వాన్ని కూడా తరచూ తమ వేదికల ద్వారా వాడుకుంటున్నాయి. ఈ విధంగా ఇకామర్స్ వెబ్‌సైట్లు ద్వారా కూడా చర్యలకు పాల్పడుతూ తనకు మానసిక క్షోభ కల్గిస్తున్నారని సల్మాన్ ఖాన్ హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై న్యాయమూర్తి మన్‌మీత్ ప్రీతం సింగ్ అరోరా స్పందించారు. తాము తరువాత పూర్తి స్థాయి ఆదేశాలను వెలువరిస్తామని, ఈ లోగా మూడు రోజులలో సామాజిక మాధ్యమాలు తగు విధంగా స్పందించాల్సి ఉందని ఆమె తెలిపారు.