దిబ్రూఘర్: అరుణాచల్ ప్రదేశ్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 14 మంది కూలీలు దుర్మరణం చెందారు. అసోంలోని టినుసూకియా జిల్లాకు చెందిన వీరి ట్రక్కు అదుపు తప్పి లోయలో పడిపోయింది.అరుణాచల్ ప్రదేశ్‌లోని అన్‌జా జిల్లాలో ఘటన జరిగింది. వెంటనే అక్కడికి సహాయక బృందాలు చేరుకున్నాయి. 14 మృతదేహాలను వెలికి తీశారు. ఓ వ్యక్తి సజీవంగా ఉన్నట్లు గుర్తించారు. ఏడుగురు జాడ తెలియడం లేదని జిల్లా ఉన్నతాధికారిస్వప్నీల్ పాల్ తెలిపారు. ఉదయం 11 గంటల ప్రాంతంలోనే ప్రమాదం జరిగింది. ఓ ప్రాజెక్టు పనికి కూలీలను కాంట్రాక్టరు ట్రక్కులో తీసుకువెళ్లుతుండగా అది అదుపు తప్పింది. వేయి అడుగుల లోతైన లోయలో పడటంతో అత్యధికులు మృతి చెందారు.