హైదరాబాద్: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. తొలి విడత పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్ హవా కొనసాగుతోంది. కాంగ్రెస్ ఇప్పటి వరకు 279 స్థానాలలో గెలుపొందగా బిఆర్ఎస్ 45, బిజెపి 5, ఇతరులు 61 స్థానాలలో విజయం సాధించారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలు మొత్తం మూడు దశల్లో జరుగుతున్నాయి. తొలి దశ పోలింగ్ గురువారం(డిసెంబర్ 11) జరుగుతుండగా.. రెండో దశ ఈనెల 14న, మూడో దశ ఈనెల 17వ తేదీన పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి.