హైదరాబాద్: తెలంగాణలో తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ముగిసింది. కొన్ని గ్రామాలలో సమయంలో లైన్‌లో నిలబడిన ఓటర్లకు ఓటు వేయవచ్చును. రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. తెలంగాణ వ్యాప్తంగా యువత, పెద్దలు, వృద్ధులు ఓటు వేసేందుకు ఉత్సాహం చూపించారు. తొలి విడత పంచాయతీ ఎన్నికలలో భారీగా ఓటింగ్ శాతం నమోదైనట్టు తెలుస్తోంది. ఉదయం 11 గంటల వరకు 52 శాతం పోలింగ్ నమోదైన విషయం తెలిసిందే. అక్కడక్కడ స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నాయి. నల్గొండ జిల్లా కోర్లపహాడ్, ఉరుమండ్ల గ్రామంలో ఘర్షణలు చెలరేగాయి. గజ్వేల్ మండలం అక్కారంలో ప్రలోభాల పర్వం కొనసాగింది. కారులో తరలిస్తున్న రూ. 2.25 లక్షలను పోలీసులు పట్టుకున్నారు.