అమరావతి: కర్నూలు జిల్లా ఆదోని ఎన్ డిబిఎల్ పత్తి జిన్నింగ్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పత్తి జిన్నింగ్ పరిశ్రమ నుంచి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికులు సమాచారం మేరకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.