లక్నో: తల్లిదండ్రుల మధ్య నలిగి నవ జాత శిశువు మృతి చెందింది. ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అమరోహా జిల్లా సిహాలి జాగీర్ గ్రామంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సిహాలీ జాగీర్ గ్రామంలో సద్దామ్-ఆస్మా అనే దంపతులు నివసిస్తున్నారు. ఈ దంపతులకు నెల రోజుల క్రితం ఒక కుమారుడు జన్మించాడు. బాలుడి శ్వాస సమస్యలు రావడంతో ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అరోగ్యం మెరుగైన తరువాత కామెర్లు రావడంతో మరోసారి చికిత్స చేయించారు. బాబును దంపతులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు. తల్లిదండ్రుల మధ్య బాబు పడుకోబెట్టుకున్నారు. ఇద్దరు మధ్యలో పడుకోవడంతో ఊపిరాడక బాలుడు చనిపోయాడు. ఉదయం తల్లి లేచి బిడ్డ పాలు ఇవ్వడానికి ప్రయత్నించింది. ఉలుకుపలుకు లేకపోవడంతో ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందాడని తెలిపారు. దంపతులు శోకసంద్రంలో మునిగిపోయారు.