హైదరాబాద్: నల్గొండ జిల్లా కోర్లపహాడ్ లో బిఆర్ఎస్- కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది. బిఆర్ఎస్- కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం కొట్టుకున్నారు. ఈ దాడిలో కొందరికి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను నకిరేకల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కోర్లపహాడ్ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు. చిట్యాల మండలం ఉరుమండ్ల గ్రామంలో ఘర్షణలు చెలరేగాయి. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కొట్టుకున్నారు. పోలీసులు ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొట్టారు. బిఆర్ఎస్ నేత, మాజీ ఎంఎల్ఎ కంచర్ల భూపాల్ రెడ్డి, డైరీ కార్పొరేషన్ ఛైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి మాటల యుద్ధానికి తెరలేపారు. ఉరమడ్లలో కంచర్ల భూపాల్ రెడ్డి పోలింగ్ బూత్ వద్దకు రావడంతో అడ్డుకోవడంతో వివాదం చెలరేగింది. దీంతో ఘర్షణ వాతావరణం తగ్గించడానికి పోలీసులు బలగాలు భారీగా మొహరించాయి. గజ్వేల్ మండలం అక్కారంలో ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. కారులో తరలిస్తున్న రూ. 2.25 లక్షలను పోలీసులు పట్టుకున్నారు. జగదేవ్పూర్ సర్పంచ్ అభ్యర్థి డబ్బుగా పోలీసుల అనుమానం వ్యక్తం చేస్తున్నారు.