డ్రీమ్ టీమ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హరనాథ్ పోలిచర్ల రచన, దర్శకత్వం, నిర్మాణంలో రూ పొందిన ’నా తెలుగోడు’ సినిమా డిసెంబర్ 12వ తేదీన విడుదల కానుంది. ఈ చిత్రంలో తనికెళ్ళ భరణి, రఘు బాబు, జరీనా వహాబ్, నైరా పాల్, రోనీ కౌలా, సుఫియా తన్వీర్ కీలక పాత్రలు పోషించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మైత్రి నవీన్ మాట్లాడుతూ “గత 25 ఏళ్లగా హరనాథ్ నాకు పరిచయం. ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని పేర్కొన్నారు. చిత్ర హీరో, నిర్మాత, దర్శకుడు హరనాథ్ పోలిచెర్ల మాట్లాడుతూ “అమ్మ గురించి, డ్రగ్స్‌పై అవగాహన, సైనికుడి జీవితం, శిశువులను కాపాడే ప్రయాణం… ఈ సినిమాలో చూడబోతున్నాము. శివ మంచి సంగీతాన్ని అందించారు”అని అన్నారు. ఈ కార్యక్రమంలో శివ నిర్వాణ, స్వరూప్, మహేష్. నైరా పాల్, సుఫియా తన్వీర్ పాల్గొన్నారు.