అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ జిల్లా పిఠాపురంలో మహిళపై దుండగులు కత్తులతో దాడికి పాల్పడ్డారు. సీతయ్యగారి తోట శివారు నరసింగపురం రోడ్డు వద్ద ఘటన జరిగింది. రాత్రి విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న అల్లం సునీతను బైక్ తో వెంబడించి ఇద్దరు దుండగులు దాడి చేశారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ గా సునీత పని చేస్తున్నారు. వాహనదారులు గమనించి ఆమెను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఆస్పత్రికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.