మన తెలంగాణ/నూతనకల్ : బిఆర్‌ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేయగా బిఆర్‌ఎస్ పా ర్టీకి చెందిన కార్యకర్త ఉప్పుల మల్ల య్య(55) మృతి చెందిన సంఘట న మండల పరిధిలోని లింగంపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక సర్పంచ్ ఎన్నికలలో భాగం గా మృతుడు మల్లయ్య కోడలు బిఆర్‌ఎస్ పార్టీ తరపున వార్డు మెంబర్ గా పోటీ చేసింది. కాగా మంగళవా రం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది.
దీనితో రాత్రి తమ పార్టీకి చెందిన కార్యకర్తలను కలవడానికి వెళుతున్న సమయం లో కాంగ్రెస్ కార్యకర్తలు ఎదురు కావడంతో ఒకరిపై ఒకరు ఆరోపించుకున్నారు. ఈ క్రమంలో ఇరు పా ర్టీలకు చెందిన నాయకులు వాగ్వా దం చేసుకున్నారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలు రాళ్లు, కర్రలతో బిఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడులకు దిగడంతో బిఆర్‌ఎస్ కార్యకర్తలకు తీవ్ర గాయాలు అవడంతో పాటు ఉప్పుల మల్లయ్య తలపై బలంగా దెబ్బ తగలడంతో అక్కడే పడిపోగా అతని తలపై రాయితో బలంగా మోదడంతో మల్లయ్య కు తీవ్ర గాయాలు అయి రక్తస్రావం విపరీతమవడంతో 108 వాహనంలో సూర్యాపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందనట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మున్న మల్లయ్య తో పాటు మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం వీరు సూర్యాపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు తెలిపారు. మృతుడికి భార్య, ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. గ్రామంలో విశాద ఛాయలు నెలకొన్నాయి. దీనితో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
పోలీసుల అదుపులోకి 8మంది నిందితులు….
లింగంపల్లి గ్రామంలో జరిగిన భారాస నాయకుడి హత్య కేసుకు సంబంధించిన ప్రధాన నిందితులు 8 మందిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు. హత్యకు పాల్పడిన ప్రధాన నిందితులు ఉప్పుల సతీష్,కొరివి గంగయ్య, వీరబోయిన సతీష్, ఉప్పుల గంగయ్య, ఉప్పుల ఎలమంచి, వీరబోయిన లింగయ్య,కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్య లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు వారు తెలిపారు. కేసును ఛేదిందుకు సమర్థవంతంగా పనిచేసిన సూర్యాపేట డిఎస్పి ప్రసన్నకుమార్, తుంగతుర్తి సర్కిల్ సిఐ నరసింహారావు, నూతనకల్ ఎస్సై నాగరాజు, పోలీస్ స్టేషన్ సిబ్బందిని అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి అభినందించారు.