విజయనగరం: గజపతినగరం ఏరియా ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ కేసు నమోదైంది. బొండపల్లి మండలం మరువాడ గ్రామానికి చెందిన నాలుగేళ్ల చిన్నారికి మూడు రోజులుగా జ్వరం తగ్గకపోవడంతో ఏరియా ఆస్పత్రిలో స్క్రబ్ టైఫస్ టెస్ట్ చేశారు. రిపోర్టులో పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ర్యాపిడ్ టెస్ట్, ఎలీసా టెస్ట్‌లో కూడా పాజిటివ్ వచ్చిందని గజపతినగరం ఏరియా ఆస్పత్రి వైద్యాధికారి ప్రవీణ్ చెప్పారు. దీంతో మరువాడ గ్రామంలో అధికారులు క్లోరినేషన్‌ను చేపట్టారు.