హైదరాబాద్: ప్రజా రవాణాను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా ఆర్ టిసి ఉద్యోగులు మరింత కష్టపడాలని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మహాలక్ష్మీ పథకం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్ టిసి ఉద్యోగులు, సిబ్బందికి పొన్నం అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆర్ టిసి ఉద్యోగులతో వీడియో కాన్ఫరెన్స్ లో దిశా నిర్దేశం చేయడం జరిగింది. విజన్ 2047లో భాగంగా ప్రజా రవాణాను 28 శాతం నుంచి 70 శాతానికి పెంచాలని సూచించారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కరిస్తామని, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు అధునాతన సౌకర్యాలతో ఆర్టీసీ స్కూల్ ఏర్పాటుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంస్థ పరిరక్షణ, ఉద్యోగుల సంక్షేమం, ప్రయాణికుల సౌకర్యం మా ప్రధాన లక్ష్యమని పొన్నం స్పష్టం చేశారు.