హైదరాబాద్: తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తనను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు రేవంత్‌కు ధన్యవాదాలు తెలిపారు. రేవంత్ రెడ్డి విజన్ చాలా గొప్పదని ప్రశంసించారు.
‘‘తెలంగాణ రైజింగ్-2047 విజన్‌లో భాగంగా అన్ని రంగాలతో పాటు సినిమా రంగానికి కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు. హైదరాబాద్ ఫిల్మ్, ఎంటర్‌టైన్‌మెంట్ గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దాలనే విజన్ చాలా గొప్పది. హైదరాబాద్‌పై ప్రపంచ సినిమా దృష్టిసారిస్తుందని విశ్వసిస్తున్నా. ఈ గొప్ప కార్యక్రమంలో నా దిశానిర్దేశం కోరడం నాకెంతో ఆనందంగా ఉంది’’ అని చిరంజీవి ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
ఇక వినోద రంగం విషయంలో ప్రపంచమంతా తెలంగాణ వైపు చూసేలా తన వంతు కృషి చేస్తానని చిరంజీవి ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ కార్యక్రమంలో తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సినిమా రంగానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఈవెంట్‌కు తనను ఆహ్వానించడాన్ని గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.