పంచాయతీ ఎన్నికల వేళ సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో బిఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరు వర్గాలు కర్రలతో పొట్టు పొట్టు కొట్టుకున్నారు. ఈ ఘటనలో ఇరువర్గాల నేతలు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో గాయపడిన వారిని చికిత్స కోసం సూర్యాపేట ఆస్పత్రికి తరలించారు. అయితే, తీవ్రంగా గాయపడిన ఓ బిఆర్ఎస్ కార్యకర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.