హైదరాబాద్: నగరంలోని అమీర్‌పేటలో అగ్ని ప్రమాద్ సంభవించింది. మైత్రివనంలోని శివమ్ టెక్నాలజీస్ కోచింగ్ సెంటర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదపులోకి తీసుకవచ్చారు. బ్యాటరీలు పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో అక్కడి కోచింగ్ సెంటర్లలోని విద్యార్థులను బయటకు పంపించారు.