హైదరాబాద్ నగరంలో రోజురోజుకు హత్యలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఓదో ఒక ప్రాంతంలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఓల్డ్ సిటీలోని కామాటిపురలో ఓ యువకుడిపై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. యువకుడిని కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
కాగా, రెండు రోజుల క్రితం హైదారాబాద్ నగరంలో ఓ రియల్ ఎస్టేటర్ ను కొందరు వ్యక్తులు నడిరోడ్డుపై కత్తులతో నరి నరికి చంపారు. అదే రోజు వారసిగూడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతిపై దారున హత్యకు గురైంది. పెళ్లికి నిరాకరించిందని కక్ష పెంచుకున్న ఓ యువకుడు.. యువతి ఇంట్లోకి చొరబడి కత్తితో ఆమె గొంతు కోసి చంపాడు. ఇలాంటి ఘటనలు తరుచూ జరుగుతుండటంతో.. సిటీలో శాంతి భద్రతలపై నగర వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.