కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ మరికొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో దేశ విదేశ కంపెనీ ప్రతినిధులు, పలువురు సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, హీరో నాగార్జున, పలువురు మంత్రులు గ్లోబల్ సమిట్ వేదిక వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమిట్‌కు వచ్చే అతిథులకు ఆహ్వానం పలుకేందుకు ఏర్పాటు చేసిన రోబో.. సిఎం రేవంత్, నాగార్జునకు గ్రాండ్ వెల్ కమ్ చెబుతూ ఆహ్వానించింది. అనంతరం సమిట్ వేదిక వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లను సిఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. ఈ సమిట్ ప్రారంభానికి ముందు అక్కడి ప్రాంగణంలో తెలంగాణ తల్లి డిజిటల్ విగ్రహాన్ని సిఎం ఆవిష్కరిస్తారు. అనంతరం తెలంగాణ గ్లోబల్ సమిట్‌ను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించనున్నారు.