పాలేరు: ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం ముజ్జుగూడెంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సర్పంచ్ అభ్యర్థి ఇంటిపై ప్రత్యర్థులు దాడికి పాల్పడ్డారు. సర్పంచ్ అభ్యర్థిని చంపేందుకు ప్రయత్నించారు. కర్రలు, రాళ్లతో దాడులకు పాల్పడడంతో గ్రామస్థులు భయంతో వణికిపోయారు. గాయపడిన వ్యక్తలను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు గ్రామానికి చేరుకొని పికెట్ ఏర్పాటు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో అల్లర్లు చెలరేగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు. ఓ ప్రజాప్రతినిధి అండతోనే అల్లర్లు చెలరేగాయని గ్రామస్థులు ఆరోపణలు చేస్తున్నారు.