రాయ్ పూర్: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో కిడ్నాప్ కలకలం సృష్టించింది. కాంట్రాక్టర్, గుమస్తాను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. మావోయిస్టుల చెర నుంచి గుమస్తా తప్పించుకున్నాడు. కాంట్రాక్టర్ కోసం భద్రతా బలగాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మావోయిస్టులపై కేంద్రం ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతున్న విషయం తెలిసిందే. 20 రోజుల క్రితం మావోయిస్టు అగ్రనేత హిడ్మాను మారేడుమిల్లి అడవుల్లో ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. హిడ్మా చనిపోవడంతో మావోయిస్టులు దాదాపుగా భూస్థాపితం అయ్యారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ ప్రకటిస్తున్న విషయం విధితమే.