హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చే మూడు విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. లండన్ నుంచి హైదరాబాద్ వస్తున్న విమానానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ల్యాండ్ కాగానే అధికారులు తనిఖీలు చేపట్టారు. శంషాబాద్ విమానాశ్రయంలో ప్రతి స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.