మన తెలంగాణ/హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలు, ముందస్తుగా షెడ్యూల్ చేయబడిన కార్యక్రమాల నేపథ్యంలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 కు హాజరు కాలేకపోతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆదివారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్- 2025 విజయవంతం కావాలని ఖర్గే ఆకాంక్షించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఖర్గే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.