పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. కొన్ని నెలల క్రితమే ‘ఒజి’ సినిమాతో సూపర్ హిట్‌ను అందుకున్నారు పవన్. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా ప్రకటించి చాలా కాలమే అయింది. కానీ, ఇతర సినిమాలతో పవన్ బిజీగా ఉండటంతో ఈ సినిమా నుంచి అప్‌డేట్స్ రావడం కాస్త ఆలస్యం అయింది. చాలా రోజుల క్రితం ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. అప్పటి నుంచి ఈ సినిమాపై హైప్ పెంచుకున్నారు అభిమానులు. తాజాగా ఈ సినిమా నుంచి అప్‌డేట్ వచ్చింది. అదేంటంటే ఈ సినిమా తొలి పాట విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. డిసెంబర్ 9వ తేదీన సాయంత్రం 6.30 నిమిషాలకు తొలి సింగిల్‌ని విడుదల చేస్తున్నట్లు సోషల్‌మీడియా ద్వారా వెల్లడించారు. ఇందుకు సంబంధించి ఓ పోస్టర్‌ని కూడా వదిలింది చిత్ర యూనిట్. అందులో పవన్ ఫుల్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నారు.
ఇక ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్-హరీశ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఏ రేంజ్‌లో సక్సెస్ అయిందో అందరికి తెలిసిందే. ఆ సినిమా తర్వాత మళ్లీ అదే కాంబో రిపీట్ కావడం.. ఇందులోనూ పవన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ చిత్రంపై భారీగా అంచనాలు పెంచుకున్నారు. ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.