మహా ధర్నాలో ఛార్జీ షీట్ విడుదల చేసిన బిజెపి నేతలు
అమలుపై సిఎం చర్చకు రావాలిః కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ కాదు సింకింగ్ తెలంగాణః డాక్టర్ కె. లక్ష్మణ్
మన తెలంగాణ/హైదరాబాద్‌ః రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ళ పాలన పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉత్సవాలు జరుపుకుంటుండగా, ఆరు గ్యారంటీలు గల్లంతయ్యాయని, 420 హామీలతో ప్రజలను మోసం చేశారని బిజెపి నేతలు మండిపడుతూ మహా ధర్నా నిర్వహించారు. తమ ఈ పోరాటం అంతం కాదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దించే వరకూ కొనసాగుతుందని పార్టీ నేతలు తమ ప్రసంగాల్లో హెచ్చరించారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు అధ్యక్షతన ఆదివారం ఇందిరా పార్కు (ధర్నా చౌక్) వద్ద జరిగిన మహా ధర్నాకు పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంచందర్ రావు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి