భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య జరిగిన రెండు టెస్ట్‌ల సిరీస్‌ని సఫారీ జట్టు 2-0 తేడాతో వైట్‌వాష్ చేసిన విషయం తెలిసిందే. అయితే గౌహటిలో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్ తర్వాత దక్షిణాఫ్రికా కోచ్ షుక్రి కాన్రాడ్ ‘గ్రోవెల్’ (సాష్టాంగపడటం) అనే పదం వాడటం భారత క్రికెట్ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. అయితే తాను ఆ పదం ఉద్దేశపూర్వకంగా వాడలేదని భారత్‌తో వన్డే సిరీస్ ముగిసి అనంతరం షుక్రి పేర్కొన్నాడు. ఆ పదాలను ఉపయోగించినదంకు చింతిస్తున్నానని తెలిపాడు.
‘ఎలాంటి దురుద్ధేశంతో ఆ కామెంట్ చేయలేదు. ఎవరిని కించపర్చాలనేది నా లక్ష్యం కాదు. నేను తెలివిగా వ్యవహరించి మంచి పదం ఎంచుకోవాల్సింది. భారత ఆటగాళ్లు ఎక్కువ సమయం ఫీల్డింగ్ కోసం మైదానంలో గడపాలన్నది నా ఉద్దేశ్యం. కానీ, ప్రజలు దీనిని తప్పుగా అర్థం చేసుకున్నారు. భవిష్యత్తులో నా భాష విషయంలో జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే ప్రతి దానికీ ఏదొక సందర్భం ముడిపడి ఉంటుంది. నా వ్యాఖ్యలతో వన్డే సిరీస్ ఆసక్తికరంగా మారింది. అంతేకాదు భారత్ సిరీస్‌ను సొంతం చేసుకుంది. దీంతో టి-20 సిరీస్ మరింత ఆసక్తికరంగా మారుతుంది’ అని షుక్రి వివరించాడు.