మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సక్సెస్‌ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో వస్తున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. ఈ సినిమా నుంచి కొద్ది రోజుల క్రితం విడుదలైన ‘మీసాల పిల్ల’ అనే పాట సూపర్ హిట్ అయింది. తాజాగా రెండో పాటను కూడా విడుదల చేసింది. హీరోయిన నయనతార ఈ సినిమాలో శశిరేఖ అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పేరుతోనే(శశిరేఖ) అనే పాటని విడుదల చేశారు. అయితే ఈ పాటను పోమవారం విడుదల చేస్తున్నట్లు ముందు ప్రకటించారు. కానీ, అభిమానుల ఆసక్తిని దృష్టిలో పెట్టుకొని ఆదివారమే పాటను విడుదల చేశారు. ఈ పాటని అనంత శ్రీరామ్ రాశారు. మధుప్రియతో కలిసి స్వీయ సంగీత దర్శకత్వంలో భీమ్స్ పాడారు. ఇక ఈ సినిమాని సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.