హైదరాబాద్: కేంద్రమంత్రిగా ఉండి కూడా కిషన్ రెడ్డి రాష్ట్రానికి చేసిందేమీ లేదని టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. బిజెపికి, కిషన్ రెడ్డికి తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిజెపికి డిపాజిట్ దక్కించుకోలేని కిషన్ రెడ్డి ఆలోచించాలని మహేష్ గౌడ్ సూచించారు. వచ్చే మూడేళ్లలో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తాం అని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.