సాయి చరణ్, ఉషశ్రీ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ’ఇట్స్ ఓకే గురు’. మణికంఠ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని క్రాంతి ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈ వెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ “ఇట్స్ ఓకే గురు టైటిల్ చాలా బాగుంది. సినిమా విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. డైరెక్టర్ మణికంఠ మాట్లాడుతూ “ఇట్స్ ఓకే గురు అనేది ఒక మంత్ర. ఎన్ని సమస్యలు వచ్చినా ఇట్స్ ఓకే అని ముందుకెళ్ళిపోతే లైఫ్ చాలా ఆనందంగా ఉం టుంది. అదే ఈ సినిమాలో ఉంది”అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మెహర్ రమేష్, హీరో సాయి చరణ్, హీరోయిన్ ఉషశ్రీ, రాజీవ్, క్రాంతి ప్రసాద్, మోహిత్ పాల్గొన్నారు.