వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంజీవ్ మేగోటి రూపొందిస్తున్న ‘పోలీస్ కంప్లెయింట్’ మూవీ ఇటీవల షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఎంఎస్‌కె ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్నారు. మనం చేసే ప్రతి చర్య తిరిగి మనకే ఫలితంగా వస్తుందన్న భావనను హారర్ థ్రిల్లర్‌గా కొత్త కోణంలో ఈ సినిమాలో చూపించనున్నామని ఫిల్మ్‌మేకర్స్ తెలిపారు. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించనుందని, సూపర్ స్టార్ కృష్ణపై చిత్రీకరించిన ప్రత్యేక గీతం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని పేర్కొన్నారు.