పనాజి: గోవా రాష్ట్రం ఉత్తర గోవాలోని ఆర్పోరా గ్రామంలో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ‘బర్చ్ బై రోమియో లేన్’ నైట్ క్లబ్ లో శనివారం అర్థరాత్రి సిలిండర్ పేలడంతో 23 మంది దుర్మరణం చెందారు. మృతి చెందిన వారిలో నలుగురు పర్యాటకులు ఉన్నట్టు సమాచారం. మృతుల్లో ముగ్గురు సజీవదహనంకాగా 20 మంది ఊపిరాడక చనిపోయారు. రాజధాని పనాజీకి 25 కిలో మీటర్ల దూరంలో నైట్ క్లబ్ ఉంది.