వాషింగ్టన్: ఫిపా వరల్డ్ కప్ 2026 ఫైనల్ డ్రా విడుదల చేశారు. 48 జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీ షెడ్యూల్‌ను వాషింగ్టన్ డిసిలోని ఎఫ్ కెన్నెడీ సెంటర్ ఫర్ ఫెర్మార్మింగ్ ఆర్ట్‌లో విడుదల చేశారు నిర్వహకులు. ఈ మెగా ఫుట్‌బాల్ సంగ్రామానికి అమెరికా, మెక్సికో, కెనెడా దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా, తొలి మ్యాచ్‌లో డిపెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా.. ఆర్జిరియాతో తలపడనుంది. 48 జట్లు బరిలోకి దిగడంతో ఫార్మాట్‌లో కొన్ని మార్పులు చేశారు. మొత్తం 48 జట్లను 12 గ్రూపులుగా విభజించారు.
ప్రతీ గ్రూపులో 4 జట్లు ఉంటాయి. ప్రతి జట్టు తమ గ్రూపులోని ఇతర 3 జట్లతో ఒక్కో మ్యాచ్ ఆ డాల్సి ఉంటుంది. ప్రతీ గ్రూప్ నుంచి టాప్-2లో నిలిచిన జట్లతో పాటు అత్యుత్తమ ప్రదర్శన చేసినన 8 జట్లు తదుపరి రౌండ్‌లోకి చేరుకుంటాయి. టాప్-2లో నిలిచిన 24 జ ట్లు.. అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మరో 8 జట్లు నాకౌట్ దశకు చేరుతాయి. ఈ నాకౌట్ స్టేజిలో ఓడిన జట్టు టోర్నీ నుంచి ఎలిమినేట్ అవుతాయి. ఆ తర్వాత క్వార్టర్స్, సెమీస్ మ్యా చ్‌లలో జరుగుతాయి. ప్రపంచ కప్‌ను గెలిచే జట్టు (గ్రూపు దశలో 3 మ్యాచ్‌లు, నాకౌట్ దశలో 5 మ్యాచ్‌లు మొత్తంగా 8 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది. అయితే, గతంలో విజేతగా నిలిచే జట్లు 7 మ్యాచ్‌లే ఆడేవి.