న్యూఢిల్లీ: ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థ సిఇఒ వై ఫల్యమే ప్రధాన కారణమని కేంద్రం భావిస్తోంది. ఈ నేపథ్యంలో కంపెనీ సిఇఒ పీటర్ ఎల్బర్స్‌కు ఉద్వాసన పలకాలని విమానయాన శాఖ కోరిన ట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై వేటు వేసేందు కు ఇండిగో కూడా సిద్ధమైందని సమాచారం. సం స్థ చేపట్టిన సంస్కరణలు, తద్వారా ఎదురయ్యే ప రిణామాలను పసిగట్టలేకపోయిన ఇండిగోపై కేం ద్ర ప్రభుత్వం భారీ మొత్తంలో జరిమానా విధించడానికి కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంక్షోభం పై వివరణ ఇవ్వాలని పౌరవిమానయాన శాఖ ఇండిగోకు నోటీసులు ఇచ్చింది. అదే సమయంలో ఇండిగో సంక్షోభంపై ఉన్నత స్థాయి విచారణకు పౌర విమానయాన శాఖ ఆదేశించింది. నలుగురు సభ్యులతో ఉన్నత స్థాయి కమిటీని నియమించిం ది. అందులో డిజిసిఎ డైరెక్టర్ సంజయ్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా. విమాన ఆపరేషన్స్ సీనియర్ కెప్టెన్ కపిల్, ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్‌స్పెక్టర్ రాంపాల్ ఉన్నారు. వీరు ప్రస్తుత సంక్షోభానికి కారణాలు అన్వేషించడంతో పాటు భవిష్యత్ ఇలా ంటివి పునరావృతం కాకుండా సూచనలు చేస్తారని ప్రభుత్వం తెలిపింది. అదే సమయంలో ఆదివారం వరకు రద్దు చేసిన
అన్ని విమానాలకు సంబంధించిన ప్రయాణికులకు రీఫండ్ ప్రక్రియను అదే రోజు రాత్రి 8 గంటలలోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది. రీఫండ్ ప్రాసెసింగ్‌లో ఏదైనా ఆలస్యం జరిగితే తక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. టికెట్ రద్దు ఫీజును కూడా ఇండిగో వసూలు చేస్తోందని పలువురు ప్రయాణికుల నుంచి సోషల్ మీడియాలో ఫిర్యాదులు, విమర్శలు రావడంతో ఇండిగో వెనక్కి తగ్గింది. పూర్తిగా రీఫండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. అదే సయంలో లగేజీలను కూడా 48 గంటల్లో ప్రయాణికులకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు తాజా పరిస్థితిపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. దీనిపై ఇండిగో తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిందేనన్నారు. విచారణకు ఒక కమిటీని నియమించామని, కమిటీ సమర్పించే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయన్నారు. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని, రైల్వేశాఖను కూడా అప్రమత్తం చేశామని, ఆ దిశగా కూడా చర్యలు మొదలయ్యాయని తెలిపారు. ఇదిలావుండగా శనివారంనాడు దేశవ్యాప్తంగా 800 విమానసర్వీసులు రద్దు చేసినట్లు ఇండిగో తెలిపింది. శుక్రవారంనాటితో పోల్చితే తక్కువ అని వివరించింది. విమాన సర్వీసుల క్రమబద్దీకరణ క్రమంగా పుంజుకుంటోందని ఒక ప్రకటనలో తెలిపింది.
ఎన్ని కిలో మీటర్లకు ఎంత ధర అంటే..?
అంతేకాదు టికెట్ రేట్లు పెంచితే ఊరుకునేది లేదని ఇండిగోతో పాటు మిగిలిన విమాన సంస్థలను విమానయాన శాఖ హెచ్చరించింది. ఇండిగో సంక్షోభాన్ని ఆసరాగా చేసుకుని మిగతా విమానయాన సంస్థలు భారీగా టికెట్ ధరలు పెంచేశాయి. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన కేంద్ర ప్రభుత్వం వాటిపై నియంత్రణ విధించింది. ప్రయాణికులపై భారాన్ని మోపితే సహించేది లేదని స్పష్టం చేసింది. కి.మీటర్ల వారిగా చార్జీలను ఖరారు చేసింది. ఎకానమీ క్లాస్‌లో 500 కి.మీ వరకు రూ.7,500, 5000 నుంచి 1000 కి.మీటర్ల వరకు రూ.12, 000, 1000నుంచి1500 కి.మీ వరకు రూ.15,000, ఆపైన కి.మీటర్లకు రూ.18,000 ఖరారు చేసింది. ఆర్‌సిఎస్‌ఉడాన్ విమానాలు, బిజినెస్ క్లాస్‌లకు తాజా నియంత్రణలు వర్తించవని స్పష్టం చేసింది.
సుప్రీంకోర్టులో పిల్..
ఇండిగో సంక్షోభం, ప్రయాణికుల పడుతున్న కష్టాలపై పలువురు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విమానల రద్దీ, తదితర ఇబ్బందులపై పిల్ దాఖలైంది. దాన్ని విచారించిన సుప్రీంకోర్టు తాజా పరిస్థితిపై నివేదికను సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.