రాష్ట్రంలో ఒపెన్ టెన్త్,ఇంటర్మీడియేట్ పరీక్ష ఫీజు చెల్లింపు షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 11 నుంచి 26 వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలంగాణలో ఓపెన్ స్కూల్ సొసైటీ (టాస్) డైరెక్టర్ పి.వి శ్రీహరి ఒక ప్రకటనలో తెలిపారు. ఒక్కో పేపర్‌కు రూ.25 ఆలస్య రుసుంతో ఈ నెల 27 నుంచి వచ్చే ఏడాది జనవరి 2 వరకు, రూ.50 ఆలస్య రుసుంతో జనవరి 3 నుంచి 7 జనవరి వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. తత్కాల్ కింద జనవరి 8 నుంచి జనవరి 12 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఒపెన్ టెన్త్, ఇంటర్ వార్షిక పరీక్షలు 2026 మార్చి లేదా ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.