తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఒకే వేదికపై మెరిశారు. శనివారం గచ్చిబౌలిలోని జీఎంసి బాలయోగి అథ్లెటిక్ స్టేడియంలో ఇండియన్ సూపర్ క్రాస్ రేసింగ్ లీగ్ సీజన్-2 కార్యక్రమానికి సిఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హజరయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు, బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అతిధుల హర్షద్వానాల మధ్య బైకర్స్ చేసిన విన్యాసాలు చూపురులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సిఎం రేవంత్, సల్మాన్ ఖాన్ షేక్ హ్యాండ్ ఇచ్చుకొని హగ్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.