తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో సినీ నటులు చిరంజీవి, నాగార్జునలతో పాటు పలువురు ప్రముఖులు శనివారం ప్రజాభవన్‌లో సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై భట్టితో చర్చించారు. ఈ సందర్భంగా గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని భట్టి విక్కమార్క ఆహ్వానించారు. తప్పకుండా వస్తామని చిరంజీవి, నాగార్జున చెప్పినట్లు తెలుస్తోంది.