సస్పెండ్ అయిన టిఎంసి ఎమ్‌ఎల్‌ఎ హుమయూన్ కబీర్ శనివారం అయోధ్య బాబ్రీ మసీదు మోడల్ మసీదు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ముషీరాబాద్ జిల్లా లోని రెజినగర్‌లో భారీ భద్రత మధ్య ఈ కార్యక్రమం జరిగింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం రాజకీయంగా వేడి పుట్టించింది. రాష్ట్రపోలీసులు, ఆర్‌ఎఎఫ్, కేంద్ర బలగాలు బందోబస్తు మధ్య ఇస్లాం మతపెద్దలుతో కలిసి కబీర్ శంకుస్థాపన నిర్వహించారు. వాస్తవానికి నిర్మాణ ప్రదేశానికి కిలోమీటర్ దూరంలో రెజినగర్‌లో ఏర్పాటైన వేదిక వద్ద రిబ్బన్ కట్ చేశారు. “ నారాఇతక్‌బీర్, అల్లాహు అక్బర్ ”అని వేలాది మంది నినాదాలు హోరెత్తించారు. మసీదు నిర్మాణకోసమని చాలా మంది ఇటుకలు మోసుకొచ్చారు. 1992 లో అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేసిన సంఘటనకు గుర్తుగా శనివారం (డిసెంబర్ 6) ఈ కార్యక్రమం జరిగింది. ప్రతిపాదించిన నిర్మాణం ఎట్టిపరిస్థితుల్లోనైనా ఆగకుండా జరుగుతుందని కబీర్ వేదికపై నుంచి వెల్లడించారు. దీనికి నిధుల కొరత లేదని ఒక పారిశ్రామిక వేత్త రూ. 80 కోట్లు విరాళంగా ఇస్తానని హామీ ఇచ్చారన్నారు.