బాలీవుడ్ నటులతో క్రికెటర్లు ప్రేమలో పడటం కొత్తేమీ కాదు. చాలా మంది అలా ప్రేమలో పడ్డారు. కొందరు వివాహ బంధంతో ఒకటైతే.. మరికొందరు బ్రేక్ అప్ చేసుకున్నారు. తాజాగా మరో క్రికెటర్, బాలీవుడ్ నటి ప్రేమలో ఉన్నారని వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. వాళ్లు ఎవరంటే.. భారత ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్, నటి సాహిబా బాలీ. వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ.. గత కొంతకాలంగా వార్తలు వినిపించాయి. తాజాగా ఈ ఇద్దరు కలిసి కాఫీ షాపులో కనిపించిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో వీరిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని మరోసారి గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఎదురుచూడాలి.
ఇక కెరీర్‌ల విషయానికొస్తే.. వాషింగ్టన్ సుందర్ కెరీర్ ఒడిదుడుకులు ఎదురుకుంటోంది. ఆల్ రౌండర్‌గా జట్టులోకి వస్తున్న అతడు ఊహించినంత ప్రధర్శన కనబర్చ లేకపోతున్నాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఫర్వాలేదు అనిపించినా, సౌతాఫ్రికాతో టెస్ట్, వన్డే సిరీస్ తొలి రెండు మ్యాచుల్లో మాత్రం తేలిపోయాడు. దీంతో మూడో వన్డేకి అతడిని పక్కన పెట్టారు. ఇక సాహిబా అటు నటిగా, ఇటు కంటెంట్ క్రియేటర్‌గా బిజీగా ఉంటోంది. కశ్మీరీ నేపథ్యం గల ఈ అమ్మాయి.. ఇటీవల స్పోర్ట్స్ ఈవెంట్స్ హోస్టింగ్ కూడా చేస్తోంది. దీంతో స్పోర్ట్స్ ఫాలో అయ్యే వారికి ఈ అమ్మాయి సుపరిచితమే. ఇక సాహిబా, సుందర్‌లు కలిసి దిగిన ఫోటోలు వైరల్ కావడంతో మరోసారి వీరిద్దరి ప్రేమాయణం చర్చకు వచ్చింది. వీరిద్దరి మధ్య ఉన్న ప్రేమనా..? లేక కేవలం స్నేహం మాత్రమేనా అని తెలియాల్సి ఉంది.