వైజాగ్: భారత్‌తో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా జట్టు ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలుత బ్యాటింగ్‌కి దిగిన సఫారీలకు ఆరంభంలోనే అర్ష్‌దీప్ షాక్ ఇచ్చాడు. తొలి ఓవర్‌లోనే రికల్టన్‌ని ఔట్ చేశాడు. ఆ తర్వాత బవుమా, డికాక్‌లు జట్టును ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి 113 జోడించారు. ఈ క్రమంలో డికాక్ అర్థశతకం నమోదు చేసుకోగా.. 48 పరుగుల వద్ద బవుమా ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన మాథ్యూ బ్రీట్జ్కే(24)తో డికాక్‌తో కలిసి స్కోర్‌ను పెంచే ప్రయత్నం చేశాడు. కానీ, ప్రశిద్ధ్ బౌలింగ్‌లో మాథ్యూ బ్రీట్జ్కే ఎల్‌బిడబ్ల్యూ రూపంలో వెనుదిరిగాడు.
ఓవైపు వికెట్లు పడుతున్న డికాక్ మాత్రం నిలకడగా బ్యాటింగ్ చేస్తూ వచ్చాడు. 89 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 106 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. మరోవైపు బ్రెవిస్ (29), మహరాజ్ (20, నాటౌట్), యాన్సెన్ (17) ఫరుగులతో చేశారు. దీంతో సౌతాఫ్రికా 47.5 ఓవర్లలో 270 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బౌలింగ్‌లో కుల్దీప్, ప్రశిద్ధ్ చెరి నాలుగు, అర్ష్‌దీప్, జడేజా తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ దక్కించుకోవాలంటే భారత్ 271 పరుగులు చేయాల్సి ఉంది.