న్యూఢిల్లీ: ఇండిగో విమానయాన సంస్థకు చెందిన విమానాలు కొన్ని అనుకొని కారణాల వల్ల రద్దైన విషయం తెలిసిందే. దీంతో దేశ వ్యాప్తంగా విమానాశ్రయాల్లో ప్రయాణికులు పడిగాపులు పడుతున్నారు. వెనక్కి వెళ్లలేకక.. ప్రయాణం చేయలేక నానా కష్టాలు ఎదురుకుంటున్నారు. ఇదే అదనుగా భావించిన పలు విమానమాన సంస్థలు టికెట్ ధరలను ఇష్టారీతిన పెంచేశాయి. తాము టికెట్ల కోసం అధిక ధరలు చెల్లించాల్సి వస్తుందని పలువురు ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఇది విషయం తన దృష్టి రావడంతో ఈ అంశంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రయాణికులకు అధిక ధరల ఛార్జీల భారం నుంచి రక్షించేందుకు చర్యలు చేపట్టింది. ధరల నియంత్రణ తీసుకువచ్చామని, వాటిని పాటించాలని పౌర విమానయాక శాఖ అదేశించింది.