మెగాస్టార్ చిరంజీవి హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’. పండగకి వస్తున్నారు అనేది ట్యాగ్‌లైన్. ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ‘మీసాల పిల్లా’ అనే పాట సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో పాట సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. ‘శశిరేఖ’ అంటూ సాగే ఈ పాట ప్రోమోని చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ పాటను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరొలియో, మధుప్రియ కలిసి పాడారు. ప్రోమోలో చూపించిన విజువల్స్ ఆకట్టుకుంటున్నాయి. పూర్తి పాటని డిసెంబర్ 8వ తేదీన విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
ఇక ఈ సినిమాలో నయనతార హీరోయిన్గా నటిస్తుండగా.. భీమ్స్ సిసిరొలియో సంగీతం అందించారు. ‘విక్టరీ’ వెంకటేష్ ఈ సినిమాలో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు. క్యాథరీన్ త్రెసా, విటివి గణేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుంది.