బ్రిస్బేన్: ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ తన కెరీర్‌లో ఎన్నో రికార్డులు సాధించాడు. ఈ తరంలో ఉత్తమ టెస్ట్ బ్యాటర్లలో స్టీవ్ స్మిత్ ఒకడని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం జరుగుతున్న యాసెస్ సిరీస్‌లో స్మిత్ చరిత్ర సృష్టించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు మార్నస్ లబుషేన్ పేరిట ఉండేది. అయితే యాషెస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో అర్థ శతకం సాధించిన స్మిత్ ఈ క్రమంలో లబుషేన్‌ని దాటేశాడు. ప్రస్తుతం లబూషేన్ ఖాతాలో 4350 పరుగులు ఉండగా.. స్టీవ్ ఖాతాలో 4358 పరుగులు ఉన్నాయి.
మొత్తంగా డబ్ల్యూటిసి అత్యధిక పరుగుల రికార్డు ఇంగ్లండ్ దిగ్గజం జో రూట్ పేరిట ఉంది. రూట్ డబ్ల్యూటిసిలో 6226 పరుగులు చేశాడు. రూట్ తర్వాతి స్థానంలో స్టీవ్ స్మిత్ ఉండగా.. అతడికి, రూట్‌కి మధ్య దాదాపు 2వేల పరుగుల వ్యత్యాసం ఉంది. ఇక యాషెస్ రెండో టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 334 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇంగ్లండ్ బ్యాటింగ్‌లో జో రూట్ (138) సెంచరీ సాధించగా,, క్రాలీ (76), ఆర్చర్ (38) పరుగులు చేశారు. అనంతరం ఆస్ట్రేలియా వికెట్లు కాపాడుకుంటూ స్కోర్ చేస్తూ వచ్చింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 378 పరుగులు చేసి 44 పరుగులు ఆధిక్యంలో ఉంది. క్రీజ్‌లో అలెక్స్ క్యారీ (46), నీసర్(15)ఉన్నారు.