అమరావతి: ఓ వ్యక్తి ఖర్జూరం తింటుండగా గొంతులో ఇరుక్కోవడంతో అతడు దుర్మరణం చెందిన సంఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… తోటగేరిలో గంగాదర్(42) అనే వ్యక్తి భార్య, కుమారుడితో కలిసి ఉంటున్నాడు. ఖర్జూరాలు తింటుండగా ఒకటి గొంతులో ఇరుక్కోవడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం అనంతపురం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో చనిపోయాడు. దీంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తోటగేరిలో విషాదచాయలు అలుముకున్నాయి.