చెన్నై: తమిళనాడు రాష్ట్రం రామేశ్వరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అయ్యప్ప భక్తులు రోడ్డు పక్కను కారు ఆపి సేదతీరుతుండగా వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో నలుగురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. మృతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం కోరపు కొత్తవలస వాసులుగా గుర్తించారు. శబరిమలకు వెళ్లి తిరిగొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.