మన తెలంగాణ/హైదరాబాద్/ముర్కుక్: అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు అని, కష్టాలకు వెరవకుండా పనిచేయాలని బిఆర్‌ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ నేతలకు సూచించారు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తుందని ధీ మా వ్యక్తం చేశారు. పల్లెలకు మంచి రోజులు వస్తాయని, గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూ ర్తితో స్వయంశక్తితో పల్లెలను అభివృద్ధి చేసుకుం టూ ముందుకు నడవాలని గ్రామస్థులకు వివరించారు. తాను దత్తత తీసుకున్న గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాల్లో ఏకగ్రీవమైన సర్పంచు లు, వార్డు మెంబర్లు శు క్రవారం కెసిఆర్‌ను మ ర్యాద పూర్వకంగా కలి సి ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామస్థుల సమష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచులను కెసిఆర్ శాలువాలతో సత్కరించారు. ఈ సందర్భంగా తన వద్దకు వచ్చిన గ్రామస్థులను పేరు పేరునా పలకరించి, వారి యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. కెసిఆర్‌ను కలిసిన వారిలో నూతనంగా ఎన్నికైన ఎర్రవెల్లి గ్రామ సర్పంచి, నారన్నగారి కవితా రామ్మోహన్ రెడ్డి
దంపతులు, ఆ గ్రామ ఉప సర్పంచ్ ఎడ్మ సబితా కరుణాకర్ సహా వార్డు మెంబర్లు., నర్సన్న పేట గ్రామ సర్పంచ్ గిలక బాల నర్సయ్య సహా ఇరు గ్రామాలకు చెందిన ప్రముఖులు, మాజీ ఎంఎల్‌సి శేరి సుభాష్ రెడ్డి తదితరులు ఉన్నారు. నూతనంగా ఎన్నికైన సర్పంచులు గొప్ప ఆలోచనలతో తమ గ్రామాలను అభివృద్ధి చేసుకునేందుకు ప్రణాళికలు రచించుకోవాలని సూచించారు. గంగదేవిపల్లి లాంటి అభివృద్ధి చెందిన స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకొని, ప్రజల భాగస్వామ్యంతో కమిటీలు వేసుకొని, మన పని మనం చేసుకుంటూ, మన పల్లె అభివృద్ధికి పాటుపడాలని తెలిపారు. ఎవరో ఏదో చేస్తారని ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని తెలిపారు. ఈ సందర్భంగా వారికి జాతీయ అంతర్జాతీయంగా పల్లెల ప్రగతికోసం గొప్ప వ్యక్తులు చేసిన కృషి గురించి కెసిఆర్ వివరించారు. బంగ్లాదేశ్‌కు చెందిన సామాజిక ఆర్థికవేత్త, స్వయం సహాయక బృందాల ఏర్పాటుకు స్ఫూర్తిదాత ప్రొఫెసర్ యూనిస్‌తో పాటు మన దేశానికే చెందిన అన్నా హజారే లాంటి దార్శనికుల గురించి వారి కృషిని వివరించారు. వారిని ఆదర్శంగా తీసుకుని గత బిఆర్‌ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో తమ పల్లెలను సామాజిక ఆర్థిక స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చి దిద్దుకోవాలని కెసిఆర్ పిలుపునిచ్చారు.