మన తెలంగాణ/సికింద్రాబాద్: పోలీసుల కళ్లుగప్పి ఏడాది కాలంగా తప్పించుకు తిరుగుతున్న కేటగాళ్లను బోయిన్‌పల్లి పోలీసులు ఆరెస్టు చేసి వారి వద్ద నుండి 4.05 కోట్ల రూపాయల నగదు ను స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ డిసిపి కా ర్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డిసిపి రష్మీ పెరుమాల్ వివరాలను వెల్లడించారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. 2024 డిసెంబర్‌లో నాగోల్‌కు చెందిన విశ్వనాథచారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు బోయిన్‌పల్లిలో చీటింగ్ కేసు నమోదు చేశారు. విశ్వనాథచారి ఆయన మి త్రులు ప్రదీప్, రవిలు మధ్యవర్తి మహ్మద్ సుబాన్ కు 50 లక్షల రూపాయల నగదును అందజేశా రు. ఆర్‌టిజిఎస్ ఎక్సైంజ్ ద్వారా 60 లక్షలు ఇస్తామని నమ్మబలికి వారికి తిరిగి ఇవ్వకపోవడంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు గత సంవత్పరం డిసెంబర్‌లో బోయిన్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. విశ్వసనీయ సమాచారం మేరకు నిఘా
పెట్టిన బోయిన్‌పల్లి పోలీసులు ప్రధాన నిందితుడు ప్రకాష్ మోతిబాయ్ ప్రజాపతి (30)తోపాటు మరో నిందితుడు ప్రగ్నేష్ కీర్తిబాయ్ ప్రజాపతి (28)లను మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల పోలీస్ స్టేషన్ పరిధిలో హుండాయ్ కారులో ప్రయాణిస్తుండగా అదుపులోకి తీసుకొని విచారించగా 50 లక్షలు తీసుకొని ఫిర్యాదుదారుని మోసం చేసినట్టు అంతేకాకుండా 4.05 కోట్ల నగదును హవాలా మార్గంలో నాగ్‌పూర్ నుండి బెంగళూరుకు తరలిస్తున్నట్టు తెలిపారు. 4.05 కోట్ల నగదుతో పాటు కారును స్వాధీనం చేసుకొని నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. హవాలా ద్వారా నగదును బదిలీ చేయడం, అదిక మొత్తం చెల్లిస్తామని నమ్మబలికి డబ్బులు వసూలు చేయడమే వృత్తిగా కొనసాగుతున్నట్టు దర్యాప్తులో తేలిందని తెలిపారు. కేసును ఛేదించడంలో సహకరించిన బోయిపల్లి పోలీస్‌స్టేషన్ డిఐ ఎంఎన్ ఆనందర్, డిఎస్‌ఐ కె. చందర్, నార్త్‌జోన్ సైబర్ సెల్ ఎస్‌ఐ శ్రీధరన్, కార్కాన ఎస్‌ఐ అశోక్ రెడ్డి తో పాటు సిబ్బందిని ఆమె అభినందించారు. ఆత్యాశకు పోయి ఉన్న డబ్బులు పోగొట్టుకోవద్దని , అధిక మొత్తంలో డబ్బులు చెల్లిస్తామనే మోసగాళ్ల మాటలు నమ్మవద్దని ఆమె ప్రజలకు సూచించారు.