హిల్ట్ పాలసీపై రాష్ట్ర హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తెచ్చిన హిల్ట్ పాలసీ జీఓ నిబంధనలకు విరుద్ధమని పర్యావరణవేత్త పురుశోత్తం, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ రాష్ట్ర హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు శుక్రవారం విచారించింది. హిల్ట్ పాలసీ పేరుతో ప్రభుత్వం 9,292 ఎకరాల భూకేటాయింపు నిబంధనలకు విరుద్ధమని, ఈ భూ కేటాయింపు అంశంపై సిబిఐ, ఇడితో దర్యాప్తు చేయించాలని, రికార్డులు సీజ్ చేసి ఫోరెన్సిక్ ఆడిట్ చేయించాలని పిటిషనర్లు కోరారు. ఈ పిటిషన్ విచారించిన ధర్మాసనం కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు ఇస్తూ తదుపరి విచారణ ఈ నెల 29కి వాయిదా వేసింది.