ఎర్రవెల్లి: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల హవా నడుస్తున్న వేళ.. బిఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సిఎం కెసిఆర్ సంచలన కామెంట్స్ చేశారు. శుక్రవారం ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామ పంచాయతీల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సర్పంచులను ఆయన కలిశారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ.. రాబోయేది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు. అన్ని కాలాలు అనుకూలంగా ఉండవని కొన్ని కష్ట సమయాలు వస్తాయని, వాటిని తట్టుకొని నిలబడాలని పేర్కొన్నారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని అప్పటివరకూ ప్రజలు అధైర్యపడొద్దని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో చేస్తుందని, ప్రజలు ఆశలు పెట్టుకొని ఆగం కావొద్దని రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి మాజీ సిఎం వ్యాఖ్యలు చేశారు.