న్యూఢిల్లీ
పాన్ మసాలా తయారీ యునిట్లపై సెస్సు విధించడానికి సంబంధించిన బిల్లును లోక్ సభ శుక్రవారం నాడు ఆమోదించింది. ఈ సెస్సు ద్వారా సేకరించే నిధిని జాతీయ భద్రతను బలోపేతం చేయడానికి, ప్రజారోగ్యాన్ని మెరుగు పరచడానికి వినియోగిస్తారు.
ఆరోగ్య భద్రత, జాతీయ భద్రతా సెస్సు బిల్లు 2025 పై జరిగిన చర్చకు ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సమాధానం ఇచ్చారు. ప్రజారోగ్యం రాష్ట్రం అంశం కాబట్టి సెస్సును రాష్ట్రాలతో పంచుకుంటామని అన్నారు. మూజువాణి ఓటుతో బిల్లును లోక్ సభ ఆమోదించింది. జాతీయ ప్రాముఖ్యం కలిగిన ఆరోగ్యం, జాతీయ భద్రతకు అవసరమైన ఆర్థికవనరుల కల్పనే ఈ బిల్లు ఉద్దేశ్యం అని నిర్మలా సీతారామన్ అన్నారు. పాన్ మసాలా, దాని వినియోగం పై గరిష్టంగా జిఎస్టీ కింద 40 శాతం పన్ను విధిస్తున్నారు. ఈ సెస్ విధఇంచడం వల్ల జిఎస్టీ ఆదాయం ఏమాత్రం తగ్గబోదని కేంద్రమంత్రి తెలిపారు.