హైదరాబాద్: చిన్నారులపై వీధికుక్కలు దాడులు చేస్తున్న కేసులు తరచూ జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితమే ఓ మూగ బాలుడిపై వీధికుక్కలు దాడి చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో బాలుడు వీధి కుక్క దాడి నుంచి తృటిలో తప్పించుకున్నాడు. యూసుఫ్‌గూడలో రెండేళ్ల బాలుడిపై వీధి కుక్క దాడికి యత్నించింది. లక్ష్మీనరసింహనగర్‌లో మన్వీత్ నందన్ ఇంటి ముందు ఆడుకుంటుండగా.. బాలుడిపైకి వీధి కుక్క దూసుకెళ్లింది. చిన్నారిని కరిచే ప్రయత్నం చేసింది. అయితే అక్కడే ఉన్న బాలుడి తాత ఇది గమనించి కర్రతో కొట్టడంతో వీధి కుక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో చిన్నారికి పెను ప్రమాదం తప్పింది.