భారత్, సౌతాఫ్రికా మధ్య గత నెలలో జరిగిన టెస్ట్ సిరీస్‌ని సౌతాఫ్రికా క్లీన్ స్వీప్ చేసిన విషయం తెలిసిందే. రెండు టెస్టుల్లోనూ ఆల్ రౌండ్ ప్రదర్శనతో రాణించి.. 0-2 తేడాతో సిరీస్‌ను దక్కించుకుంది. ఈ సిరీస్‌లో సఫారీ బౌలర్ సైమన్ హార్మర్ అద్భుత ప్రదర్శన కనబర్చాడు. దీంతో అతను నవంబర్ నెలలో ఐసిసి ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డుకు పురుషుల విభాగంలో నామినేట్ అయ్యాడు.
హార్మర్‌తో పాటు బంగ్లాదేశ్ స్పిన్నర్ తైజుల్ ఇస్లాం, పాకిస్థాన్ ఆల్ రౌండర్ మొహమ్మద్ నవాజ్ కూడా ఈ నామినేషన్‌లో ఉన్నారు. ఈ ప్రతిష్టాత్మక అవార్డు రేసులో భారత్ తరఫున ఒక్క ప్లేయర్ కూడా లేకపోవడం గమనార్హం. ఇక హార్మర్ విషయానికొస్తే.. భారత్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అతడు తన స్పిన్ మాయాజాలాన్ని చూపించాడు. తన బౌలింగ్‌తో భారత ఆటగాళ్లను ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఈ సిరీస్‌లో హార్మర్ మొత్తంగా 17 వికెట్లు తీశాడు. అంతకు ముందు పాకిస్థాన్‌తో జరిగిన సిరీస్‌లోనూ అతడు రాణించాడు. ఆ సిరీస్‌లో 13 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐసిసి మంత్లీ అవార్డుల్లో మహిళల విభాగంలో భారత స్టార్ షెఫాలీ వర్మ నాయినేట్ అయింది. ఆమెతో పాటు ఈ లిస్ట్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ఎడమచేతి స్పిన్నర్ తిపట్చా పుత్తావోంగ్, యూఏఈ కెప్టెన్ ఇషా ఓజా కూడా ఉన్నారు.