హైదరాబాద్‌కు వచ్చే విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం భయాందోళనకు గురి చేస్తోంది. తాజాగా దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఇకె526 విమానం దుబాయ్ నుంచి హైదరాబాద్‌కు వస్తోంది. ఈ క్రమంలో విమానాన్ని పేల్చేస్తామంటూ రాజీవ్ గాంధీ విమానాశ్రయానికి చెందిన ఎటిఎస్‌కు ఇ-మెయిల్ వచ్చింది. దీంతో వెంటనే అప్రమత్తమై విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ యేశారు. ప్రయాణికులను సురక్షిత ప్రదేశానికి తరలించారు. అనంతరం విమానరంలో క్షణంగా తనిఖీలు చేపట్టారు. ఎలాంటి అనుమానస్పద వస్తువులు లభించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గురువారం కూడా హైదరాబాద్‌కి మదీనా నుంచి వస్తున్న విమానంలో బాంబు బెదిరింపు వచ్చిన విషయం తెలిసిందే.